పుచ్చకాయ (వాటర్‌ మెలన్‌) మాక్‌టైల్‌

కావలసిన పదార్థాలు, తయారుచేసే విధానం

కావలసిన పదార్థాలు: పుచ్చకాయ- ఒకటి, చల్లని సోడా- 500 ఎంఎల్‌, ఐస్‌ క్యూబ్స్‌- 15, పుదీనా ఆకులు- కొన్ని, నిమ్మకాయలు- రెండు, చక్కెర- ఒక స్పూను. 

తయారుచేసే విధానం: ముందుగా పుచ్చకాయ ముక్కల్ని కోసుకుని ఫ్రీజర్‌లో పెట్టాలి. నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఓ నిమ్మబద్దను సన్నటి వలయాల్లా కత్తిరించాలి. గంట తరవాత పుచ్చకాయ ముక్కలు, సోడా, నిమ్మరసం, చక్కెర కలిపి జ్యూసర్‌లో తిప్పాలి. ఈ జ్యూస్‌నంతా ఓ జగ్గులోకి తీసుకుని ఐస్‌ క్యూబ్‌లూ కలపాలి. పొడవాటి గ్లాసుల్లో వేసి నిమ్మదబ్బ, పుదీనా ఆకుల్ని పైన అలంకరిస్తే అంతే మాక్ టైల్ రెడీ.. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox