విధుల్లో అమరుడైన ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు పాడె మోసిన మంత్రులు

ప్రభుత్వ లాంఛనాలతో ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

ఖమ్మం: గుత్తికోయల దాడిలో అమరుడైన అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు పాడె మోశారు. అంత్యక్రియల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతకుమారితోపాటు పలువురు అటవీ అధికారులు పాల్గొన్నారు.

శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, తోటి అధికారుల రోదనలతో ఈర్లపూడిలో విషాయఛాయలు అలముకున్నాయి. మరోపక్క పోడు భూముల విషయంలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అటవీ అధికారులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అంతిమ సంస్కారాల్లో  శ్రీనివాస రావు అంతిమ సంస్కారాల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సహా ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. విధుల్లో అమరుడైన అటవీ అధికారికి అంజలి ఘటించారు.   

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox