రాష్ట్ర బిల్లులు త్వరితగతిన ఆమోదించేలా రాజ్యాంగ సవరణ చేయాలి

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

హైదరాబాద్: తెలంగాణతో పాటు రాష్ట్రాల్లో ఆమోదించిన వివిధ బిల్లులను గవర్నర్లు పెండింగ్ లో పెడుతున్నారని ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా రాజ్యాంగ సవరణ చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. నిర్దిష్ట గడువులోగా బిల్లులను పరిశీలించి ఆమోదించే విధంగా పరిస్థితి ఉండాలన్నారు. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రుతురాజ్ అవస్థికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు.

రాజ్యంగంలోని 200 వ ఆర్టికల్ ను సవరించి యాజ్ సూన్ యాజ్ పదంలో విత్ ఇన్ 30 డేస్ అనే పదం చేర్చాలన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్రానికి సిఫారసు చేయాలని లేఖలో కోరారు. యాజ్ సూన్ యాజ్ అన్న పదం వెసులు బాటును గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ప్రజల తీర్పుతో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయంగా నామినేట్ అయిన గవర్నర్లు ఇబ్బందుల పాలు చేయడం దురదృష్టకరమని వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో పూర్తి సానుకూలంగా ఉన్న గవర్నర్లు భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox