ఐటీ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడిన మంత్రి మల్లారెడ్డి (Mallareddy)
తమను నమ్మించి మోసం చేశారని మంత్రి మల్లారెడ్డి (Mallareddy) మండిపాటు
హైదరాబాద్: ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి (Mallareddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐటీ అధికారులు తమను నమ్మించి మోసం చేశారని మల్లారెడ్డి (Mallareddy) ఆరోపించారు. తన ఇంట్లో సోదాలు పూర్తయిన తర్వాత తనతో, తన చిన్న కుమారుడితో సంతకాలు చేయించుకున్నారని మంత్రి అన్నారు.
తన పెద్ద కొడుకుకు సంబంధించి కూడా రిపోర్ట్ తయారు చేశారని, ఆయనతో సంతకం చేయించుకోవడానికి వెళ్తుంటే... ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో ఉన్నారని, తన కొడుకు తరపున కూడా తానే సంతకం పెడతానని చెప్పానని.
దానికి ఐటీ అధికారులు అంగీకరించారన్నారు. కానీ మోసం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా కుమారుడి దగ్గరకు వెళ్లి సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. అంత అవసరం ఏం వచ్చిందని మల్లారెడ్డి (Mallareddy) ఆవేదన వ్యక్తం చేశారు.
నాన్నతో ఐటీ అధికారులు సంతకం చేయించుకుంటున్నారని ఆసుపత్రి నుంచి తన మనవరాలు తనకు ఫోన్ చేసి చెపితే తాను షాక్ కు గురయ్యానని పేర్కొన్నారు. తన కొడుకు ఆ పేపర్లో ఏముందో కూడా చదవకుండా సంతకం పెట్టేశాడని అన్నారు. ఇంత మోసం చేయాల్సిన అవసరం ఐటీ అధికారులకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox