మలేషియా నూతన ప్రధానిగా మాజీ ప్ర‌తిప‌క్ష నేత ఇబ్ర‌హీమ్

దేశ చ‌క్ర‌వ‌ర్తి సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయం

మ‌లేషియా: మ‌లేషియా నూతన ప్రధానిని ఆ దేశ చక్రవర్తి నియమించారు. మాజీ ప్ర‌తిప‌క్ష నేత అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్ ఆ దేశ ప్ర‌ధానిని నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో మలేషియాకు అన్వ‌ర్ 10వ ప్ర‌ధాని కానున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక‌పోవ‌డంతో అక్క‌డ ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దేశ చ‌క్ర‌వ‌ర్తి సుల్తాన్ అబ్దుల్లా.. కొత్త ప్ర‌ధానిగా ఇబ్ర‌హీమ్ ను నియ‌మిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్ర‌ధాని యాసిన్ ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్వ‌ల్ప మెజారిటీ కూడా సాధించ‌లేక‌పోయారు. చ‌క్ర‌వ‌ర్తి సుల్తాన్ స‌మ‌క్షంలో మ‌లేషియా ప్ర‌ధానిగా అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం