నటి రీచా చద్దా వివాదాస్పద ట్వీట్.. సైన్యానికి క్షమాపణ

రీచా చద్దా ట్వీట్ రాజకీయంగా పెను దుమారం

ముంబయి: బాలీవుడ్ నటి రీచా చద్దా నెట్టింట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన ట్వీట్ లో గల్వాన్ ప్రస్థావన తేవడమే తాజా ట్రోలింగ్ కు కారణంగా మారింది. రిచా సైన్యాన్ని అవమానించారని భాజపా, శివసేన శ్రేణులు మండిపడ్డాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంపై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ఆమె పెట్టిన సందేశం చర్చనీయాంశంగా మారింది.

అంతకుముందు పాక్ ఆక్రమిత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశమైనా తాము సిద్ధమని ఆర్మి అధికారి లెఫ్ట్ నెంట్ కమాండర్ జనరల్ ఉపేందర్ వ్యాఖ్యలను ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను కోట్ చేసి నటి చద్దా గల్వాన్ సేస్ హాయ్ అంటూ రీట్వీట్ చేశారు. ఇది దుమారానికి దారి తీసింది. సైన్యాన్ని కించపరిచేలా నటి ట్వీట్ ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిచా చద్దా చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox