కమల్ హాసన్ (kamal Hasan) ఆరోగ్యంపై ఆసుపత్రి కీలక ప్రకటన

మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించిన వైద్యులు

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ (kamal Hasan) స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రి కీలక ప్రకటన చేసింది. ఒకట్రెండు రోజుల్లో కమల్ హాసన్ (kamal Hasan) ను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. అయితే స్వల్ప అస్వస్థతో నిన్న ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కమల్ హాసన్ (kamal Hasan) ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఇంటికి వెళ్లి కలిశారు. 'విక్రమ్‌'తో ఇటీవలే విజయాన్ని అందుకున్న కమల్‌హాసన్‌ ప్రస్తుతం 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్‌ పరంగా జోరు మీదున్న ఆయన తన గురువు కె.విశ్వనాథ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox