గ్రూప్-2,3,4 లో మరికొన్ని రకాల పోస్టులను జత చేసిన సర్కారు

త్వరలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.!

హైదరాబాద్: త్వరలోనే గ్రూప్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ సర్కారు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రకటనలో గ్రూప్- 2, 3, 4 లో మరికొన్ని రకాల పోస్టులు చేరుస్తూ నిరుద్యోగులకు తీపి కబురు అందజేసింది. గ్రూప్‌-3 లో మరో రెండు రకాల పోస్టులను జత చేసింది. గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు గ్రూప్-4 లో మరో 4 రకాల పోస్టులు చేర్చుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేరుస్తూ ప్రకటించింది.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం