పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)

52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని వ్యాఖ్య

హైదరాబాద్: పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా పెంచాలి బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, ఈడీ, ఐటీ సోదాలు టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామాలని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) మండిపడ్దారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి హత్యకు గురి కావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని అన్నారు. అలాగే 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున పోరాడుతామని తెలిపారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతికి పంపుతామని అన్నారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం