వచ్చే డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌: వచ్చే డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

కాగా, ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరాల్సిన ఆదాయంలో రూ.40వేలకోట్లకుపైగా తగ్గుదల నమోదైందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఇలాంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని కేసీఆర్ అన్నారు. 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం