కేంద్రం సైగతో పీవోకేను స్వాధీనం చేసుకుంటామన్న భారత్.. పాక్ ఆర్మీ స్పందన
తమ భూభాగంపై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టగల సామర్థ్యం తమకు ఉందన్న పాక్
ఇస్లామాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే చాలని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలను వెంటనే అమలు చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని భారత ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర త్రివేదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో లాంచింగ్ ప్యాడ్‌లు, ఉగ్రవాదులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ ఆర్మీ ఓ ప్రకటన చేసింది.
''మా భూభాగంపై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టగల సామర్థ్యం తమకు ఉంది. అందుకు సన్నద్ధంగా ఉన్నాం'' అని పాక్ సైన్యం వెల్లడించింది. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, ఉగ్రవాదుల వల్ల భారత్ కు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని తాజాగా ఉపేంద్ర త్రివేదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
దాదాపు 160 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడడానికి పీవోకేలోని లాంచింగ్ ప్యాడ్‌ల వద్ద వేచి ఉన్నారని మొన్న తెలిపారు. దీనిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందిస్తూ… ''ఉపేంద్ర ద్వివేదీ చేసింది అనవసర ప్రకటన'' అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి భారత ఆర్మీ ధోరణి ఏంటో స్పష్టమవుతోందని పాక్ పేర్కొంది. ఆర్మీ తీరు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది. దృష్టిని మళ్లించడానికే లాంచ్ పాడ్లు, ఉగ్రవాదులు అంటూ భారత ఆర్మీ ఆరోపణలు చేస్తోందని పాక్ ఆర్మీ పేర్కొంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox