రష్మిక మందన్నాకు సొంతింటి కష్టాలు.. సినిమా భవిష్యత్తు ఇక ముందుకెళ్తుందా.?

రష్మికపై భగ్గుమంటున్న సినీ అభిమానులు

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నాకు సొంతింటి కష్టాలు వచ్చి పడ్డాయి. దీంతో ఆమె సినీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుంది. దీంతో ఇక ఆమె కన్నాడలో ముందుకెళ్తారా అనే సందేహం రాకుండా పోవట్లేదు. అసలు విషయంలోకి వెళితే.. హీరోయిన్ రష్మిక మందన్నా,  డైరెక్టర్‌ రిషబ్‌శెట్టి ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్‌లోనే అత్యుత్తమస్థాయిలో ఉన్నారు.

పుష్ప హిట్‌తో పాన్‌ ఇండియా లెవల్లో స్టార్‌డమ్‌ రష్మిక కొట్టేసింది. ఇక కాంతారా తో ఒక్కసారిగా మోస్ట్‌ వాంటెడ్‌ డెరెక్టర్‌గా రిషబ్‌ షెట్టి మారిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య రాజుకున్న వివాదం అసలు ఎక్కడ మొదలైంది? రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి లు ఒకరు హీరో కమ్ డైరెక్టర్ అయితే మరొకరు హీరోయిన్. ఒకే ఇండస్ట్రీ వాళ్లైనా ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అందుకు కారణం ఆ మధ్య రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌. తను నటి కావాలని అనుకోలేదనీ, తన అందం, నటన చూసి అవకాశాలు నడిచొచ్చాయని ఓ ఇంటర్వ్యూలో రష్మిక కామెంట్‌ చేసింది.

మీ కెరీర్‌ ఎలా స్టార్టయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో రష్మికను ప్రశ్నిస్తే… కాలేజ్ డేస్ లో నేను మోడలింగ్ చేస్తున్నాను. ఆ టైంలోనే ఈ సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ నుండి కిరాక్ పార్టీ మూవీ ఆఫర్ వచ్చింది" అంటూ రెండు చేతులతో సైగలు చేస్తూ చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన రిషబ్‌ షెట్టి బ్యానర్‌ పేరు కూడా మెన్షన్‌ చేయకుండా చేతులతో సంకేతాన్నిచ్చారు.

రష్మికని అసలు సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేసింది రిషబ్‌ శెట్టి. కిర్రాక్ పార్టీ లోనీ అతని గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో హేళనగా మాట్లాడటం ఇప్పుడు కన్నడనాట కలకలం రేపుతోంది. అసలు ఎప్పుడో మాట్లాడిన రష్మిక వ్యాఖ్యలు ఇప్పుడు తెరపైకి తెచ్చింది ఇటీవల రిషబ్‌ శెట్టి ఇంటర్వ్యూ ఒకటి. వీరి మధ్య వైరం ముదిరిన విషయాన్ని ఇదే ఇంటర్వ్యూ మరోసారి రుజువు చేసింది. దీంతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారనే ఇలా అవహేళన చేయడం ఏం బాగోలేదని, ఆమెను ఇండస్ట్రీకి దూరం పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమె కన్నాడ  సినీ పరిశ్రమలో భవష్యత్తు ప్రశ్నార్ధకంగా మారినట్లు కనిపిస్తోంది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox