తొలి వన్డేలో భారత్ ఘోర పరాజయం..న్యూజిలాండ్ ఘన విజయం

17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన న్యూజిలాండ్

హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధావన్ సేన 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేదనకు దిగిన కివీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, మరో 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. లాథమ్ 145, విలియంసన్ 94, తో చెలరేగారు.

ఇక శార్దూల్ ఠాకూర్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో.. ఒక్కసారిగా మ్యాచ్ కివీస్ వైపు తిరిగింది. భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ 80, శిఖర్ ధావన్ 72, శుభమన్ గిల్ 50, అర్థ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 306 పరుగులు చేసింది. ఆఖరిలో వాషింగ్టన్ సుందర్ 37 మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం