రోస్‌ వేడుకలో కుప్పకూలిన వధువు.. హఠాన్మరణం

కర్ణాటకలో ఘటన

బెంగళూరు: రోస్‌ వేడుకలో వధువు కుప్పకూలి మరణించింది. ఉడుపి కోళలగిరి హవంజెలో జరిగింది. హవంజెకీ చెందిన జోస్నా లూయిస్‌ (24)కు గురువారం పెళ్లి జరగాల్సిఉంది. పెళ్లికి ముందు రోజు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటలకు బంధువుల ఇంటిలో రోస్‌ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ఆమె స్పృహ తప్పి పడిపోగా స్థానిక ఆస్పత్రికి తరతలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. లో బీపీనే కారణమని బంధువులు తెలుపుతుండగా, మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox