భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష ఎన్నిక

ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు

న్యూదిల్లీ: పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్లకు గడువు ఆదివారమే ముగిసింది. అయితే ఉషకు పోటీగా ఒక్కరు కూడా నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
దాంతో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు పొందారు.

దీనితో పాటు మహారాజా యాదవీంద్ర సింగ్ (1934, క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించారు. కాగా, 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఉష 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో ఉష వీరోచిత ప్రతిభను కనబర్చింది. ఒక్క ఆసియా క్రీడల్లోనే ఆమె 14 స్వర్ణాలతోపాటు 23 పతకాలు గెలుచుకుంది.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం