రాంగ్‌రూట్‌ లో పోతే రూ.1700 కు తప్పదు మూల్యం

ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నిబంధనలు పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇవాళ పోలీస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నగరంలో రాంగ్ రూట్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్ రైడింగ్‌ ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నేటి నుంచి ట్రాఫిక్ పోలీస్ స్పెషల్‌ డ్రైవ్ నిర్వహిస్తుంది. రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నారు.

ఇవాళ ఉదయం నుంచి గోషామహల్, అబిడ్స్, నాంపల్లి, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కూడలిలలో స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించారు. ఇక చుట్టు పక్కల జిల్లాల నుంచి 1 నుంచి 8 రిజిస్ట్రేషన్ గల ఆటోలను హైదరాబాద్ లో ప్రయాణించడానికి ఆంక్షలు విధించడంతో ఆటో డ్రైవర్లు ఎంజె మార్కెట్ కూడలిలో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ సి ఐ ధనలక్ష్మి జోక్యం చేసుకొని వాళ్లకు సర్ది చెప్పి పంపించేశారు.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం