డిసెంబర్ నుంచి పెరగనున్న హీరో బైక్‌ ల ధరలు

ద్విచక్ర వాహనాల ధరలను రూ.1,500 వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటన

న్యూదిల్లీ: వచ్చే డిసెంబర్ నుంచి హీరో మోటోకార్ప్ వాహనాలు ప్రియం కానున్నాయి. డిసెంబర్ 1 నుంచి తమ ద్విచక్ర వాహనాల ధరలను రూ.1,500 వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో డీలక్స్, స్లెండర్, ప్యాషన్ సహా ఇతర వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి. 

తయారీ ఖర్చు పెరిగిన కారణంగా బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని కంపెనీ పేర్కొంది. దీనివల్ల మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచడం తప్పనిసరి అయిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల విడి భాగాల ధరలు పెరిగాయని, దీని వల్ల మొత్తం తయారీ వ్యయం పెరిగిందని అన్నారు.

ఇక దేశంలో నంబర్- 1 మోటార్‌సైకిల్‌గా హీరోస్ స్లెండర్ కొనసాగుతోంది. అక్టోబర్‌లో హీరో స్లెండర్ 2,61,721 యూనిట్లను విక్రయించింది. గతంలో(2021) సెప్టెంబర్‌లో ధరలు పెంచగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా వాహనాల ధరలను పెంచింది. ఇప్పటి వరకు కంపెనీ అన్ని టూ-వీలర్ మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1000 నుండి రూ. 3000 వరకు పెంచింది.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం