అక్కడ వారానికి మూడు రోజులు సెలవుదినాలే..!

పని ఒత్తడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీల సంచలన నిర్ణయం

లండన్: వారంలో నాలుగు రోజులు మాత్రమే ఉద్యోగులు పని చేసేలా కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. దీంతో యూకేలోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ సంస్థలు వారానికి ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యూకేలో సుమారు వంద కంపెనీలు ఉద్యోగులకు పని ఒత్తడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. 

అదికూడా జీతంలో ఎలాంటి కోత పెట్టకుండా, పని గంటలను సర్దుబాటు చేయకుండా.. నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని సూచించాయి. వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పనిచేస్తున్నారు. 4డే వీక్‌ క్యాంపెయిన్‌లో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండన్‌లోని అతి పెద్ద కంపెనీలు అయిన అటమ్‌ బ్యాంక్‌, గ్లోబల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అవిన్‌ సైతం ఈ జాబితాలో చేరాయి. 

కాగా, ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ పనితీరు ఎలా ఉందనేది అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు. కొత్త పాలసీతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కంపెనీ ఉత్పాదకతలో మార్పులేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఉద్యోగుల పనివేళలను నిజాయతీగానే తగ్గించాం.

ఐదు రోజుల పనిగంటలను కుదించి నాలుగు రోజులకు సర్దుబాటు చేయలేదు’ అని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిలకు చెందిన పరిశోధకులు సుమారు 3,300 మంది ఉద్యోగులు ఉన్న 70 కంపెనీల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ, ఫలితాలను పరిశీలిస్తున్నాయి.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం