దేశవ్యాప్తంగా మొరాయించిన జియో (Jio) సేవలు..!

ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు వినియోగదారులు ఆవేదన

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) సేవలు మంగళవారం మొరాయించాయి. వినియోగదారులు కాలింగ్‌, మెసేజింగ్‌ వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలను నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు వాపోతున్నారు.

చాలా మంది వినియోగదారులు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు తెలిపారు. ఈ విషయంపై పలువురు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. జియో (Jio) సర్వీసులు నిలిచిపోవడంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌గా మారాయి. మరోవైపు, ఓ వినియోగదారుడు తన మొబైల్‌లో ఉదయం నుంచి VoLTE సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు ట్వీట్‌ చేశాడు.

సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నించాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown ట్రెండ్‌ అవుతోంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు. అయితే, ఇప్పటి వరకు సర్వీసులు నిలిచిపోవడంపై కంపెనీ స్పందించలేదు.

కాగా, గతంలోనూ జియో (Jio) సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ సేవలు దాదాపు మూడు గంటల పాటు ప్రభావితమయ్యాయి. మొబైల్ డేటా సర్వీసెస్‌ను మాత్రం వినియోగించుకోగలిగారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం