చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ అస్తమయం

చైనా ప్రభుత్వ మీడియా ప్రకటన

బీజింగ్: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) బుధవారం తుదిశ్వాస విడిచారు. ల్యుకేమియా, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఆయన షాంఘైలో మధ్యాహ్నం 12.13 గంటలకు మరణించినట్టు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, పార్లమెంట్, కేబినెట్, సైన్యం ఆయన మరణాన్ని ధ్రువీకరిస్తూ చైనా ప్రజలకు ఓ లేఖను విడుదల చేసింది.

అసాధారణ నేత అని, అత్యున్నత స్థాయి గౌరవనీయుడని , గొప్ప మార్కిస్టు, పక్ష, మిలిటరీ స్ట్రాటజిస్ట్, దౌత్యవేత్త, సుదీర్ఘ పరీక్షలకు నిలిచిన కమ్యూనిస్ట్ యోధుడని కీర్తిస్తూ నివాళి అర్పించాయి. అంతేకాకుండా కామ్రేడ్ జియాంగ్ జెమిన్ మరణం వల్ల కమ్యూనిస్టు పార్టీకి, సైన్యానికి , అన్ని రకాల దేశీయ వర్గాల ప్రజలకు పూడ్చలేని నష్టం జరిగినట్టు తెలిపింది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం