52వ సారి రక్తదానం చేసిన ప్రైవేట్ లెక్చరర్ ప్రవీణ్ కుమార్

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి: జిల్లాలోని రాజంపేట గ్రామానికి చెందిన బందం ప్రవీణ్ కుమార్ అనే ప్రైవేట్ లెక్చరర్ 52వ సారి రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అర్యభట్ట కళశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న అయన రక్తహీనతతో బాధపడుతున్న ఓ మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం ఉండడంతో తక్షణమే స్పందించి విటీ ఠాగుర్ రక్తనిధికి రక్తం అందజేశారు. లింగంపేట మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన నర్సవ్వ రక్తహీనతతో ఉన్నది వారి కుటుంబసభ్యులు రక్తం కావాలని కోరడంతో రక్తదానం చేశారు. ఈ సందర్బంగా నర్సవ్వ కుటుంబ సభ్యులు ప్రవీణ్‌కుమార్‌కు కృతజ్ణతలు తెలిపారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం