తెలంగాణలో 90 శాతం అవినీతి పాలన సాగుతోంది: రాంమాధవ్

యువ సమ్మేళనంలో ముఖ్యవక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్

మహబూబ్ నగర్: తెలంగాణలో 90 శాతం అవినీతి పాలన సాగుతోందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైందని ఆర్ఎస్ఎస్ జాతీయ నేత రాంమాధవ్ అన్నారు. మహిళలపై ఆగడాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో నైజం విముక్త స్వాతంత్రోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో ముఖ్యవక్తగా ఆర్ఎస్ఎస్ జాతీయ నేత రాంమాధవ్ హాజరయ్యారు.

అవినీతిపై పోరాడేందుకు యువత సంకల్పం తీసుకోవాలని రాంమాధవ్ పిలుపునిచ్చారు. ఆరోజున ఈ తెలంగాణను పరిపాలిస్తున్న నిజాం గాని, ఆయన యొక్క రాక్షస మూకలు గాని, వారికి సపోర్టు చేస్తున్న బ్రిటీషు చర్చిలు గాని, చర్చి అధికారులు గాని చేసిన కుట్రలు సఫలం అయి ఉంటే మనం ఇలా కూర్చొని ఉండే వాళ్లం కాదని తెలిపారు. ఈ పాలమూరు గడ్డ పాకిస్థాన్ లో భాగం అయ్యేదని అన్నారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox