డిసెంబర్ లోగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు బృహత్ ప్రణాళికలు: పురపాలక శాఖ

జియోగ్రాఫికల్ సిస్టంతో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా మాస్టర్ ప్లాన్

హైదరాబాద్: డిసెంబర్ లోగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు బృహత్ ప్రణాళికలు సిద్ధమవుతాయని పురపాలక శాఖ తెలిపింది. మొత్తం 144 పురపాలక సంఘాలు, కార్పోరేషన్లకు గాను 74 పట్టణాలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్లు ఆమోదించి అమలులోకి తెచ్చినట్లు పురపాలక శాఖ పేర్కొంది. మిగిలిన 68 లో మహబూబాబాద్, అందోల్, జోగిపేట్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవర కొండ పురపాలికల ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు పురపాలక శాఖ సంచాలకులు తెలిపారు. 
జియోగ్రాఫికల్ సిస్టంతో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా మాస్టర్ ప్లాన్ రెడీ అయినట్లు పురపాలక శాఖ వెల్లడించింది. ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు సేకరించాక వివిధ వర్గాలతో భేటీ అవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox