కేంద్రం మోసం చేస్తే వడ్లు కొని కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు
సిద్ధిపేటలో నూతన మండలాలను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు (Harish Rao)
సిద్ధిపేట: వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టడాన్ని తిరస్కరించినందుకు రాష్ట్రానికి వచ్చే రూ.6 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లాలో కుకునూరు పల్లి, నిజాం పేట్, అక్బర్ పేట నూతన మండలాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు (Harish Rao)పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక తెరాస నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం వడ్లు కొననని రైతులను మోసం చేస్తే కేసీఆర్ వారి సమస్యలసు పరిష్కరించి అన్నదాతలకు అండగా నిలిచారని తెలిపారు.
సిద్ధిపేట జిల్లాలో నూతన మండలాలకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టడాన్ని తిరస్కరించినందుకు రాష్ట్రానికి వచ్చే రూ.6 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని అన్నారు. రూ.400 ఉన్న సిలిండర్ రూ.1200 కు పెంచారన్నారు. చేనేతలపై కూడా జీఎస్టీ వేసిన ఘటన మోదీ ప్రభుత్వానిదే నని మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox