తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల

ఈనెల 23 నుండి వచ్చే నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే దాదాపుగా 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయగా వాటి భర్తీ వివిధ దశల్లో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లో 9 వేల 158 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 23 నుండి వచ్చే నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణ నిర్వహించనుంది. ఏప్రిల్/ మే నెలలో గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ నుండి అతి పెద్ద నోటిఫికేషన్ ఇదేనని ఉన్నతాధికారులు తెలిపారు.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం