ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగించే వీధి వ్యాపారులపై రూ.5 వేల జరిమానా

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

అమరావతి: ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన మార్గదర్శకాలకు సంబంధించి అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించే వీధి వ్యాపారులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తి, దిగుమతిపై తొలిసారి పట్టుబడితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. అదే విధంగా రెండో సారి పట్టుబడిన వారికి ఏకంగా రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిలువ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు, అంతేకాకుండా సీజ్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేజీకి రూ.10 చొప్పున అదనపు జరిమానా విధిస్తారు. ఆయా సంస్థలు, మాల్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా విధించేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం