పాఠశాల విద్యార్థులకు ఢీకొన్న టిప్పర్ లారీ..విద్యా‌ర్థి మృతి

రంగారెడ్డి జిల్లాలో విద్యార్థిని బలిగొన్న లారీ

రంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ కు వెల్లేందుకు గొల్లపల్లి స్టేజి వద్ద నిలుచున్న పాఠశాల విద్యార్థులను టిప్పర్ లారీ అదుపుతప్పి ఢీ కొట్టింది. అనంతరం లారీ ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ ఘటనలో విద్యార్థి లారీ టైర్ కింద ఇరుక్కుని మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన విద్యార్థులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించనున్నారు. టిప్పర్ లారీ విద్యార్థులను ఢీ కొట్టిన సమయంలో ప్రక్కన గేదె ఉంది. లారీ ఢీ కొట్టిన తీవ్రతకు అది కూడా మృతి చెందింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox