దిల్లీ: దిల్లీలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లో ఎప్పుడూ ఏదో ఒక ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదానికి జేఎన్యూ యూనివర్శిటీ వేదికైంది. విశ్వవిద్యాలయ గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలను రాశారు. క్యాంపస్ ను బ్రాహ్మణులు విడిచి వెళ్లాలి... బ్రాహ్మణ్-బనియాలపై ప్రతీకారం తీర్చుకుంటాం... బ్రాహ్మణ్ భారత్ చోడో వంటి పిచ్చి రాతలు రాశారు.
వర్శిటీలోని స్కూల్ ఆఫ్ అంగ్వేజ్ అండ్ లిటరేచర్ విభాగం గోడలు, పలువురు ఫ్యాకల్టీ గదుల డోర్లపై బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, అభ్యంతరకరమైన రాతలు రాశారు.దీంతో, వర్శిటీ క్యాంపస్ లో అలజడి చెలరేగింది. దీనిపై యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ శాంతిశ్రీ పండిట్ దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఏబీవీపీ ఆరోపించింది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox