9,168 ఉద్యోగుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్

ఈ నెల 23 నుండి వచ్చే నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే దాదాపుగా 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయగా వాటి భర్తీ వివిధ దశల్లో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లో 9 వేల 168 పోస్టులు ఉన్నాయి.

ఈ నెల 23 నుండి వచ్చే నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణ నిర్వహించనుంది. ఏప్రిల్/ మే నెలలో గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ నుండి అతి పెద్ద నోటిఫికేషన్ ఇదేనని ఉన్నతాధికారులు తెలిపారు. గ్రూప్ -4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా 9,168 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, గురువారం టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది.

గ్రూప్ 4లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈమేరకు గతంలో ఇచ్చిన ఉత్వర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్- 4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన గ్రూప్ -4 నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ పోస్టులు భారీగా ఉన్నాయి.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం