ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పౌర సన్మానానికి హాజరవ్వనున్న రాష్ట్రపతి

అమరావతి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆమె పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఆమె దిల్లీలో బయలుదేరి ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఆమె హాజరవుతారు. ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్రన్, సీఎం జగన్ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను సన్మానిస్తారు. అనంతరం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ హరిచందన్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. కాగా, గతంలో రాష్ట్రపతి ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం