జగన్ పాలనలో డ్వాక్రా సంఘాలకు కష్టాలు: చంద్రబాబు

‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా సంఘాలకు కష్టాలు మొదలయ్యాయని ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కొవ్వూరులో ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గతంలో డ్వాక్రా సంఘాలకు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలిచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల గురించి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని బాబు దుయ్యబట్టారు.

డ్వాక్రా సంఘాలను కేవలం సిఎం జగన్ మీటింగ్‌లకు ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించిన పార్టీ టిడిపి అని తెలిపారు. టిడిపి చూపిన చొరవతో అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూసే రోజులు వచ్చాయన్నారు. జగన్ పాలనలో మహిళలకు చాలా అన్యాయం జరిగిందని మండిపడ్డారు. టిడిపి హయాంలో డ్వాక్రా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం