ఆ కారణంతోనే పవన్ నా కూతురి వివాహానికి హాజరుకాలేదు: అలీ

కుమార్తె వివాహ వేడుకకు పవన్ రాలేదన్న వార్తలపై స్పందించిన అలీ

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ ఇటీవల తన కుమార్తె వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు.

అయితే అలీతో ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం పెళ్లికి రాలేక పోయాడు. ఆయన పెళ్లికి హాజరుకాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పుకార్లకు అలీ స్వస్తి పలికారు. పవన్ కళ్యాణ్ పెళ్లి వేడుకకు రాకపోవడానికి గల కారణాలపై స్పందించాడు.

“హరిహర వీరమల్లు” చిత్రీకరణ జరుగుతున్న రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నంలకు పెళ్లి కార్డులు అందించాను. వారు నిస్సందేహంగా వివాహానికి హాజరవుతారని అతనికి సమాచారం అందిందన్నారు.

పవన్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకున్నారని అలీ తెలిపారు. కానీ చివరి నిమిషంలో విమానం క్యాన్సిల్ అవ్వడంతో రాలేకపోయానని పవన్ ఫోన్ చేసి చెప్పినట్లు వివరించారు. పవన్ కళ్యాన్ స్వయంగా ఇంటికి వచ్చి కొత్త జంటను కలుస్తానని చెప్పారని అలీ పేర్కొన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం