ముంబయిలో నెల రోజుల పాటు 144 సెక్షన్

జనవరి 2 వరకు ఆంక్షల నడుమ ముంబయి

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి జనవరి 2 వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. నగరవ్యాప్తంగా ఐదుగురికి మించి గుమికూడడం, నిరసనలు, ప్రచారాలు చేయడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయడంపై నిషేధం విధించామని నగర డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ వెల్లడించారు.  వివాహ సంబంధిత కార్యక్రమాలు, అంత్యక్రియలు, న్యాయ సంబంధ సమావేశాలు, కో ఆపరేటివ్ సోసైటీలు, సినిమాలు, వినోద కార్యక్రమాలు, ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యకలపాలు, పాఠశాలలు, కళాశాలలు, అన్ని రకాల విద్యా సంస్థలు అనుమతి ఉంటుందని విశాల్ ఠాకూర్  తెలిపారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox