అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
సమావేశానికి హాజరైన హోంశాఖ, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు
హైదరాబాద్: అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంశాఖ, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన భవనాల అంశంపై చర్చించారు. వాణిజ్య, నివాస భవనాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
సెల్లార్లలో వ్యాపారాలు అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. అక్రమంగా నిర్మించిన సెల్లార్లు, భవనాల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీగా ఉంటున్న సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో సెల్లార్లను నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారాలను చేస్తుండడంతో అగ్గి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని వివరించారు ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను, భవనాల వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox