ఇతర రాష్ట్రాలకు బీఆర్ఎస్ విస్తరించే పనిలో కేసీఆర్.!

బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు.!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టి సారించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకలలో విస్తరించే అంశంపై దృష్టి పెట్టారు. పలువురు మాజీ, సిట్టింగ్ శాసనసభ్యులు, పార్లమెంటేరియన్లు పార్టీ అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

తోట చంద్రశేఖర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డ సంగతి తెలిసిందే. ఇటీవల పార్టీలో చేరిన చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తదితరులు రాష్ట్రంలో పర్యటించడం ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీలైనంత ఎక్కువ మంది నాయకులను చేరవేసేందుకు మరియు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఈ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

కర్ణాటకలో తెలుగువాళ్ళు ఎక్కువగా ఉన్న సరిహద్దు నియోజకవర్గాలపై  దృష్టి సారిస్తుంది. JD(S) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామితో కలిసి ముందుకు వెళ్ళడం ప్రణాళికలు రచిస్తున్నారు. 
ఒడిశాలో, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా కనీసం 15 మంది మాజీ శాసనసభ్యులు,  పార్లమెంటు సభ్యులు,  కాంగ్రెస్ పార్టీకి చెందినవారు వచ్చే రెండు నెలల్లో BRSలో చేరనున్నారు. పార్టీ ఒడిశా యూనిట్‌ను ప్రారంభించేందుకు చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి చివరి వారంలో ఒడిశాలో పర్యటించనున్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox