మళ్ళీ పెరుగుతున్న నేరాలు.. అలర్ట్ అయిన పోలీసులు!

విమర్శలకు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో పాలన పడకేసిందని ప్రతిపక్షాలు విమర్శలకు ఎక్కు పెట్టాయి. కేసీఆర్ పాలన మీద దృష్టి పెట్టకుండా తను కొత్తగా ఆరంభించిన బీఆర్ఎస్ పార్టీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నరని ఆరోపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పినట్లుగా కనిపిస్తుదని విమర్శించాయి. తాజాగా జరుగుతున్న నేరాలు ఇందుకు అర్థం పడుతున్నాయి.

గత 15 రోజులుగా  హైదరాబాద్ జరుగుతున్న నేరాలు ప్రజలను ఉలిక్కిపాటు గురిచేస్తున్నాయి. చైన్ స్నేచింగ్ కేసులు, జియాగూడ మర్డర్ కేసు కేసీఆర్ అదనపు సెక్రెటరీ స్మిత సబర్వాల్ ఇంట్లోకి అనుమతి లేకుండా తహసిల్దార్ చొరబాటు కలవరపాటుకు గురి చేసింది. దీంతో ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విమర్శలను ఎక్కుపెట్టాయి.శాంతి భద్రతల విషయంలో కెసిఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించాయి కొత్త పార్టీ మీదున్న దృష్టి పాలన మీద లేదని విమర్శించాయి.

వరుస  నేరాలు జరుగుతుండడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వరుసల సంఘటనలు నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

నేరాలు జరగకుండా అడ్డుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సితాసబర్వాల్ ఇంట్లో చొరబాటు కేసు జియాగూడ హత్య కేసు పై దృష్టి పెట్టారు అలాగే నగరంలో జరిగిన పలు చైన్ స్నాచింగ్ కేసుల  నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. 

ఇన్నాళ్లు నేరాలు కాస్త తగ్గుముఖం పట్టిన మళ్లీ నేరాల సంఖ్య పెరిగిపోతుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డిజిపి నేతృత్వంలో నగరంలోని  పలువురు పోలీసు ఉన్నతాధికారులతో త్వరలో కీలక సమావేశం జరగనున్నట్లు సమాచారం.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox