బోధన్ పట్టణంల శివసేన ఆధ్వర్యంలో రక్తదానం

బోధన్ లో రక్తదానం చేసిన శివసైనికులు

శివసేన పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ బాలా సాహెబ్ థాక్రే గారి 97వ జయంతి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 126వ జయంతిని పురస్కరించుకొని శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్త దాన శిబిరంలో శివసేన పార్టీ కార్యకర్తలు మరియు బాలసాహెబ్ మరియు నేతాజీ గార్ల అభిమానులు రక్తదానం చేయడం జరిగింది. 

ఈ సందర్బంగా శివసేన జిల్లా అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ గారు మాట్లాడుతూ బాలసాహెబ్ మరియు నేతాజీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకుని వారికీ నివాళులు అర్పించి యువత వారి త్యాగాన్ని వారి విధానాలను మరవకుండా తమ వంతు దేశ సేవ చేయడంలో ఎల్లప్పుడు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈరోజు రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాదాపు100 పైగా రక్తదానం చేశారు నిజామాబాద్ రెడ్ క్రాస్ మరియు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి కి రక్తం డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ గారు మరియు పాండవుల భూమన, ఎనుగంటి గౌతం గౌడ్ చింతకుల లోకేష్ గౌడ్ రాహుల్ ,బాబు అన్న, ఆకుల రాజు,కిరణ్, శ్రీకాంత్,పసులోటి లోకేష్ ,శ్రీకర్,ప్రితం,అనిల్,నాగరాజు, ప్రసాద్, లింగం,వెంకట్,ఆకాష్,యోగేష్,బొంతల్ గంగాధర్ లు పాల్గొన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం