మారుతీ సుజుకి Q3 నికర లాభం రెట్టింపు; షేర్లు జంప్

Q3 FY23 నికర లాభం ₹ 2,351 కోట్లతో గణనీయమైన పెరుగుదల

ముంబయి: ఆటో మేజర్ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మంగళవారం డిసెంబర్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికం ఫలితాలను ప్రటించింది. Q3 FY23 నికర లాభం ₹ 2,351 కోట్లతో  గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది.

ఇది క్రితం సంవత్సరం త్రైమాసికంలో ₹ 1,011 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగింది . Refinitiv IBES డేటా ప్రకారం, సగటున కంపెనీ ₹ 1,881 కోట్ల లాభాన్ని రిపోర్ట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కార్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో లాభం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండడంతో కంపెనీ అధిక లాభాలను సాధించింది.

ఇదిలా ఉండగా, వాహన తయారీ సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి ₹ 23,246 కోట్లతో పోలిస్తే (YoY)  సుమారు 25% వృద్ధితో ₹ 29,044 కోట్లకు చేరుకుంది.

ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 465,911 వాహనాలను విక్రయించింది. దేశీయ మార్కెట్లో విక్రయాలు 403,929 యూనిట్లు మరియు ఎగుమతులు 61,982 యూనిట్లు. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఈ త్రైమాసికంలో దాదాపు 46,000 వాహనాల ఉత్పత్తిని ప్రభావితం చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో దేశీయంగా 365,673 యూనిట్లు మరియు ఎగుమతి మార్కెట్లలో 64,995 యూనిట్లతో కూడిన 430,668 యూనిట్ల మొత్తం అమ్మకాలతో పోలిస్తే.

త్రైమాసికంలో, కంపెనీ ₹ 27,849 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో నికర అమ్మకాలు ₹ 22,187 కోట్లుగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం క్యూ3లో ₹ 919 కోట్ల నుంచి 2022-23 క్యూ3లో దాని నిర్వహణ లాభం ₹ 2,123 కోట్లకు పెరిగింది.

మంగళవారం మధ్యాహ్నం డీల్స్‌లో BSEలో మారుతి సుజుకి షేర్లు 2% కంటే ఎక్కువ ₹ 8,595 వద్ద ట్రేడవుతున్నాయి. ఏడాది వ్యవధిలో ఆటో స్టాక్ 7% చేరుకుంది..

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం