హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. విక్రయదారుడు అరెస్టు
ముంబయి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయం
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేపుతోంది. భరత్ అనే మాదక ద్రవ్యాల విక్రయదారుడిని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. ముంబయి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంబర్‌పేట్‌లో ఒక కస్టమర్‌కు భరత్ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 15 గ్రాముల ఎమ్డీఎమ్ఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు కస్టమర్లను పోలీసులు గుర్తించారు. విద్యార్థులు, యూత్ డ్రగ్స్‌కి బానిసలు కావద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని పోలీసులు కోరుతున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox