దిల్లీలో కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి

భయాందోళనకు గురైన ప్రజలు

న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో దిల్లీ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ మధ్యాహ్నం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాని ప్రభావంతోనే దిల్లీలో ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్)ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఇటీవల దిల్లీ ప్రాంతంలో తరచుగా భూమి కంపిస్తోంది. జనవరి 5న ఆఫ్ఘనిస్థాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం రాగా, దిల్లీలోనూ, జమ్ము కశ్మీర్ లోనూ దాని ప్రభావం కనిపించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ గతంలో భూకంపం సంభవించగా, భారత్ లోనూ ప్రకంపనలు వచ్చాయి.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం