యువతను రాజకీయాల్లోకి ప్రేరేపించడమే "జాతీయ ఓటర్ల దినోత్సవం" ముఖ్య ఉద్దేశం.. పూర్తి కథనం
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
1950లో ఇదే రోజున ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. యువతను రాజకీయాల్లో పాల్గొనేలా ప్రేరేపించడానికి ఒక మార్గంగా జాతీయ ఓటర్ల దినోత్సవం 2023 వేడుకలను భారత ప్రభుత్వం ఎంచుకుంది.
మొదటి జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25, 2011 న నిర్వహించబడింది, అప్పటి నుండి, ఇది ఒక నిర్దిష్ట థీమ్ తో జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
2023లో 13వ వార్షిక జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈసీ ఐకాన్లు, ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలతో సహా ఓటర్ల భాగస్వామ్యానికి విశేష కృషి చేసిన వారికి జాతీయ అవార్డులను ప్రదానం చేస్తారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం 2023 చరిత్ర
2011, జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత ఎన్నికల కమిషన్ జనవరి 25, 1950న నిర్మాణం జరిగడంతో ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడానికి ఈరోజు విశేషంగా మారింది. దీని ద్వారా భారత పౌరులకు ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి భారత ప్రభుత్వం ఈ రోజును జరుపుకోవాలని నిర్ణయించింది.
దేశంలో జరిగే ప్రతి ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. కాగా ఈ ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవ థీమ్ "నథింగ్ లైకో ఓటింగ్, ఐ ఓట్ ఫర్ శ్యూర్" ‘Nothing Like Voting, I Vote for Sure’". ఓటు వేయడానికి కనీస వయస్సు 18 ఏళ్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox