పంటలలో దిగుబడి రాక మహిళా రైతు ఆత్మహత్య

అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండల పరిధిలోని ఓబులాయనపల్లిలో ఘటన

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండల పరిధిలోని ఓబులాయనపల్లి దువ్వ నాయక్ భార్య శోభారాణి (36) గురువారం ఉదయం తన పొలంలో ఆత్మహత్య చేసుకుంది. వేసిన పంటలకు దిగుబడి రాకపోవడం, చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పంటలకు వేసే పురుగుల మందులు సేవించి ఆత్మహత్య పాల్పడింది.

భర్త దువా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలను తెలియజేశారు. శోభారాణి దువ్వా నాయక్ తమకున్న పొలంలో కొన్ని సంవత్సరాలుగా అప్పులు చేసి వివిధ రకాల పంటలను పండించారు. 

ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయానికి దిగుబడి రాకపోవడం, వారిని మానసికంగా మనోవేదనకు గురిచేసింది. దీంతో మృతురాలు శోభారాణి జీవితం పై విరక్తి చెంది చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పంటలకు వేసే పురుగుమందులను సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

తదుపరి గమనించిన కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతురాలకు 15 సంవత్సరాల ప్రణవ నాయక్, 13 సంవత్సరాల హేమశ్రీ బాయి ఉన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox