తెలంగాణ ప్రభుత్వానికి సంక్రాంతి 'కిక్'.. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు!
మూడు రోజుల్లోనే రూ.419.11 కోట్ల విలువైన మద్యం విక్రయాలు
హైదరాబాద్: ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో తెలంగాణలో మూడు రోజుల్లోనే రూ.419.11 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరినట్లుగా ఎక్సైజ్ శాఖకు తెలిపింది. ఇప్పటి వరకు 2023 సంకాంత్రిలోనే అత్యధిక మధ్యం అమ్ముడుపోయినట్లుగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
అన్ని డిపోలలో మొత్తం 4.29 లక్షల మద్యం కేసుల IMFL ( విదేశీ మద్యం)తో పాటు మొత్తం 5.61 లక్షల కేసులను జనవరి 13, 14, 16 తేదీల్లో విక్రయించినట్లుగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. జనవరి 15 వైన్ షాష్‌లకు అధికారులు సెలవులు ప్రకటించారు. లేకపోతే మరికొంత ఆదాయం సమకూరేదని అధికారులు తెలిపారు.
సాధారణ పనిదినాల్లో సగటున రూ.75 కోట్ల అమ్మకాలు ఉండగా , జనవరి 13, 14, 16 తేదీల్లో వరుసగా రూ.153.71 కోట్లు, రూ.113.09 కోట్లు, రూ.152.31 కోట్ల విక్రయాలు జరిగాయి. జనవరి 13న మొత్తం 1.62 లక్షల కేసుల ఐఎంఎఫ్‌ఎల్, 1.82 లక్షల బీర్ కేసులు రూ.153.71 కోట్లకు విక్రయించగా, జనవరి 14న 1.14 లక్షల ఐఎంఎఫ్‌ఎల్ కేసులు, 1.53 లక్షల బీర్ కేసులు రూ. అమ్మారు. జనవరి 15న మొత్తం 1.53 లక్షల కేసుల ఐఎంఎఫ్‌ఎల్, 2.26 లక్షల కేసుల బీర్లు రూ.152.31 లక్షలకు అమ్ముడయ్యాయి.
బీర్‌పై ఎంఆర్‌పిపై రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఎక్సైజ్ సుంకాన్ని పొందుతుండగా, ఇతర మద్యంపై ఎక్సైజ్ సుంకం 80-85 శాతం మధ్య ఉంటుందని అంచనా. 2023కి మంచి ప్రారంభంతో, 2022 ఆదాయాన్ని అధిగమించి ఈ ఏడాది రూ. 40,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox