46 వేల చెరువులను పునరుద్ధరించాం: మంత్రి కేటీఆర్
60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని ఐటీ మంత్రి వెల్లడి
నిజామాబాద్: గత ఎనిమిదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరించామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలో కాకతీయ స్యాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం అందించామని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామన్నారు. 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని చెప్పారు.
2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండిందని, 2022 నాటికి 3.5 కోట్ల టన్నులు పండించే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox