సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విలువ రూ. 7 వేల కోట్లు: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

ఉద్యమం సమయంలో చెప్పిన ప్రతీ మాటను కేసీఆర్ నిజం చేశారన్న మంత్రి

సూర్యాపేట: ఎనిమిదేళ్ల పాలనలో ఉద్యమం సమయంలో చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు రూ. 4 కోట్ల 24 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింద‌న్నారు.

సూర్యాపేట నియోజక వర్గంలో ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు రూ. 85 కోట్లు అని తెలిపారు. సూర్యాపేట నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి పనుల విలువ రూ. 7000 కోట్లు దాటింద‌న్నారు. తెలంగాణలో కేసీఆర్ అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమ‌ను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox