ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్ 279 పాయింట్ల లాభంతో 60,223 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 17,656 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.15 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox