తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు సభ ప్రారంభం కాగా, తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశాల్లోనే ఈ నెల 6న 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఇదిలా ఉండగా, దాదాపు రెండేళ్ల తర్వాత గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. మొదట్లో గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను జరపాలని ప్రభుత్వం భావించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఆమె బడ్జెట్ కు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. చివరగా గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అంగీకరించగా, ఆమె సైతం బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox