గ్రూప్ -4 ఉద్యోగాలకు 9.51 లక్షల దరఖాస్తులు

జులై 1న గ్రూప్-4 రాత‌ప‌రీక్ష

హైదరాబాద్: గ్రూప్-4 ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగిసింది. ఈ పోస్టులకు గాను రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి.  గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీ కింద 8,180 పోస్టుల‌కు టీఎస్‌పీఎస్సీ ద‌ర‌ఖాస్తుల‌ను నిర్వ‌హించింది. గడువు ముగిసే సమయానికి 9,51,321 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చినట్లు అధికారులు వెల్లడించారు. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 30వ తేదీతో గ్రూప్-4 ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు ముగిసింది.

ఆ రోజు వ‌ర‌కు 8,47,277 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. జ‌న‌వ‌రి 29న 49 వేలు, 30వ తేదీన 34,247 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల వ్య‌వ‌ధిలో 1,04,044 ద‌ర‌ఖాస్తులు కొత్త‌గా వ‌చ్చాయి. అయితే గ్రూప్-4 రాత‌ప‌రీక్ష జులై 1న నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం