రంగారెడ్డి జిల్లాలో ఘోరం..భార్యను చంపిన భర్త

పసికందును నీటి సంపులో వేసి మరి ....

పసికందును  నీటి సంపులో వేసి మరి .... 
భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి చంపి.. నెల‌న్న‌ర ప‌సికందును నీటి సంపులో ప‌డేసి..

రంగారెడ్డి: క్ష‌ణికావేశంలో ఓ భ‌ర్త త‌న భార్య‌ను హత్య చేశాడు. కిరాతకంగా గొడ్డ‌లితో న‌రికి హత్య చేశాడు. నెలన్నర ఉన్న ప‌సికందు( Child )ను నీటి సంపులో ప‌డేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్‌మెట్ ప‌రిధిలోని అనాజ్‌పూర్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే...అనాజ్ పూర్ కు చెందిన ఏర్పుల లావణ్య తో ధన్ రాజ్ వివాహం కొన్నెండ్ల క్రితం పెళ్లి జరిగింది.

వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు, కూతురు వయసు 3 సంవత్సరాలు, కుమారుని వయస్సు  నెలన్నర. అయితే కాన్పుకోసం పుట్టింటికి వెళ్లిన భార్య బుధవారం అత్తవారింటికి వచ్చింది. ఏమి జరిగిందేమో గాని ఇంట్లోకి వచ్చిన వెంటనే ధన్ రాజ్ భార్యపై గొడ్డలి తో దాడి చేశాడు.దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇది చూసి కూతురు భయం తో బయటికి పరిగెత్తుతుకుంటూ వచ్చింది. అక్కడే ఉన్న పసికందును నీటి సంపులో వేశాడు . విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox