మాజీ మంత్రి విజయ రామారావు అంత్యక్రియలు పూర్తి
మహా ప్రస్థానం లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్: మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. విజయ రామారావు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా విజయరామారావు తో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. విజయ రామారావు నిజాయితీగల అధికారని, మంచి పరిపాలనదక్షుడని అన్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox